Khiladi 5 Days Collections: పని చేయని క్రాక్ సెంటిమెంట్.. దారుణమైన కలెక్షన్లతో

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అయితే అందుకోవడం లేదు. వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ఐదవరోజు తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగతా ఏరియాల్లో ఏ మాత్రం కలెక్షన్స్ రాలేకపోయాయి. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Khiladi Movie Review రవితేజ కి మరో ఫ్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ | Filmibeat Telugu
బాక్సాఫస్ టార్గెట్..

బాక్సాఫస్ టార్గెట్..

రవి తేజ 'ఖిలాడి' సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ బాగానే చేసింది. క్రాక్ సినిమాతో రవితేజ ఫామ్ లోకి రావడంతో ఈ సినిమాకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. రబితేజపై బయ్యర్లు బాగానే పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

5వ రోజు కలెక్షన్స్

5వ రోజు కలెక్షన్స్

'ఖిలాడి' సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ మొదటి రోజు తప్పితే మిగతా రోజుల్లో వసూళ్లు చాలా తక్కువగా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.20 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.72 కోట్లు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

 5 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

5 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

ఖిలాడి సినిమాకు ఫస్ట్ రోజు 4.30 కోట్ల షేర్ వసూళ్లు రాగా రెండవ రోజు 1.95కోట్లు వచ్చాయి. ఇక ముడవ రోజు 1.51కోట్లు రాగా 4వ రోజు 87 లక్షలు వచ్చాయి. 5వ రోజు కేవలం 72 లక్షలతో మొత్తంగా 5 రోజుల్లో ఏపీ తెలంగాణలో 7.76కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 5 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్.. నైజం 3.47 కోట్లు, సీడెడ్ 1.47 కోట్లు, ఉత్తరాంధ్ర 1.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ.9.35కోట్ల కోట్లు షేర్, రూ. 15.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో తప్పితే ఖిలాడి మిగతా రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లను సాధించలేదు. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 0.76 కోట్లు, ఓవర్సీస్‌లో 0.44 కోట్లు, హిందీలో 0.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఖిలాడి 11.05కోట్ల షేర్ ను సాదించింది. ఇక 19.50 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి.

 హిట్టవ్వాలి అంటే..

హిట్టవ్వాలి అంటే..

రవితేజ ఖిలాడి సినిమాతో భారీగానే బిజినెస్ చేశారు. మొత్తానికి నిర్మాత అయితే సేఫ్ అయ్యాడు గాని బయ్యర్లు భారీగా లాస్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా రూ. 24.80 కోట్లు మేర బిజినెస్ చేసిన ఖిలాడి 25.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. ఇక 5 రోజుల్లో సినిమాకు 11.05 కోట్ల షేర్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 12.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఖిలాడి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X