twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Khiladi 6 Days Collections: దారుణంగా పడిపోతున్న వసూళ్లు.. ఇక లాభాల్లోకి రావడం కష్టమే?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది క్రాక్ సినిమాతో మంచి ఓపెనింగ్స్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది మాత్రం ఆ తరహాలో ఓపెనింగ్స్ అందుకోలేకపోయాడు. ఖిలాడి సినిమాకు మొదటి వారంలోనే కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గి పోయాయి. ఆదివారం కూడా అనుకున్నంతగా రాలేదు. ఇక సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ పతనం మొదలైంది. చూస్తుంటే ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులో ఖిలాడి నిలిచే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆరు రోజుల్లో ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Khiladi Movie Review రవితేజ కి మరో ఫ్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ | Filmibeat Telugu
    బాక్సాఫస్ బిజినెస్ ఎంతంటే..

    బాక్సాఫస్ బిజినెస్ ఎంతంటే..

    'ఖిలాడి' మూవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బిజినెస్ బాగానే చేసింది. క్రాక్ సినిమా ప్రభావంతో రవితేజ మార్కెట్ పెరిగిందని బయ్యర్లు కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

    6వ రోజు కలెక్షన్స్

    6వ రోజు కలెక్షన్స్

    యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 'ఖిలాడి' మూవీ రిలీజ్ కంటే ముందే కొంత బజ్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ అనంతరం నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక వీకెండ్ లో కూడా సినిమా వసూళ్లు చాలా తక్కువగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.19 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.56 కోట్లు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఆరు రోజుల్లో మొత్తం కలెక్షన్స్...

    ఆరు రోజుల్లో మొత్తం కలెక్షన్స్...

    ఖిలాడి మూవీకి మొదటి రోజు 4.30 కోట్ల షేర్ వసూళ్లు రాగా సెకండ్ డే 1.95కోట్లు వచ్చాయి. ముడవ రోజు 1.51కోట్లు రాగా నాలుగవ రోజు 87 లక్షలు వచ్చాయి. 6వ రోజు కేవలం 56 లక్షలతో మొత్తంగా ఆరు రోజుల్లో ఏపీ తెలంగాణలో 9.91 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 6 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్.. నైజం 3.66 కోట్లు, సీడెడ్ 1.58 కోట్లు, ఉత్తరాంధ్ర 1.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 1.00 కోట్లు, కృష్ణాలో రూ. 54 లక్షలు, నెల్లూరులో రూ. 48 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 9.91కోట్ల కోట్లు షేర్, రూ. 16.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

     ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు

    ఖిలాడి సినిమా బిజినెస్ బాగానే చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ పెద్దగా రాలేవు. ఇక మిగతా రాష్ట్రాల్లో అయితే పెద్దగా వసూళ్లను సాధించలేదు. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 0.79 కోట్లు, ఓవర్సీస్‌లో 0.46 కోట్లు, హిందీలో 0.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఖిలాడి 11.76 కోట్ల షేర్ ను సాదించింది. ఇక 21 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి.

    ఖిలాడి మూవీకి ఇంకా ఎంత రావాలంటే..?

    ఖిలాడి మూవీకి ఇంకా ఎంత రావాలంటే..?

    ఖిలాడి సినిమా విడుదల కంటే ముందు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక విడుదల తరువాత నెగిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు ఊహించినంత. కలెక్షన్స్ ఏమి రాలేవు. నిర్మాత ముందుగానే సినిమాను ఏరియాల వారిగా అమ్ముకోవడంతో సేఫ్ అయ్యాడు. ఇక బయ్యర్లు లాస్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా రూ. 24.80 కోట్లు మేర బిజినెస్ చేసిన ఖిలాడి మూవీ 25.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. ఇక 5 రోజుల్లో సినిమాకు 11.05 కోట్ల షేర్ దక్కింది. ఇక బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 11.74 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఖిలాడి ఇంకా రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.

    English summary
    Ravi Teja khiladi 6 days World wide collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X