Khiladi 7 Days Collections: మొదటివారం మాస్ రాజాకు ఊహించని షాక్.. ఇంకా ఎంత రావాలంటే?

వరుస అపజయాల అనంతరం రవితేజ ఒక సినిమాతో మంచి హిట్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడని అనుకుంటున్న సమయంలో మళ్ళీ అపజయాల బాట పడుతున్నాడు. క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మాస్ రాజా మళ్ళీ ఎప్పటిలానే తడబడ్డాడు అనిపోస్తోంది. ఖిలాడి సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా వసూళ్లను ఏమి రబట్టలేకపోతోంది. మొదటి రెండు రోజుల్లోనే సినిమా పరిస్థితి అర్ధమయ్యింది. ఇక సినిమా మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి? నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా ఎంత రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
 మరోసారి..

మరోసారి..

మాస్ మహారాజ రవితేజ దర్శకుడు రమేష్ వర్మ ఇదివరకే కొన్నేళ్ల క్రితం వీర అనే సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక గతంలో చాలాసార్లు రమేష్ వర్మ రవితేజతో సినిమా చేయాలని ప్రయత్నం చేశాడు గాని వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఖిలాడి సినిమా సెట్టవ్వడంతో సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. కానీ సినిమా వెండితెరపైకి వచ్చిన అనంతరం ప్లాప్ టాక్ ను అందుకుంది.

బిజినెస్ భారీగానే..

బిజినెస్ భారీగానే..

'ఖిలాడి' సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. రవితేజ మార్కెట్ పెరిగిందని బయ్యర్లు కూడా ఆలోచించకుండా గట్టిగానే పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

7వ రోజు వచ్చిన షేర్

7వ రోజు వచ్చిన షేర్

'ఖిలాడి' సినిమా విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో మొదటిరోజు వసూళ్లు గట్టిగానే వస్తాయని అనుకున్నారు. కానీ ఆశించినంతగా రాలేవు. తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.13 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.42 కోట్లు షేర్, రూ. 0.72 కోట్లు గ్రాస్ వచ్చింది.

 7 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

7 రోజుల్లో మొత్తం కలెక్షన్స్..

ఖిలాడి మూవీకి ఫస్ట్ డే రోజు 4.30 కోట్ల షేర్ వసూళ్లు రాగా సెకండ్ డే 1.95కోట్లు వచ్చాయి. ముడవ రోజు 1.51కోట్లు రాగా నాలుగవ రోజు 87 లక్షలు వచ్చాయి. 6వ రోజు కేవలం 56 లక్షలు, 7వ రోజు 42 లక్షలు ఇలా మొత్తంగా ఆరు రోజుల్లో ఏపీ తెలంగాణలో 10.33 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 7 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్.. నైజం 3.79 కోట్లు, సీడెడ్ 1.67 కోట్లు, ఉత్తరాంధ్ర 1.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, గుంటూరులో రూ. 1.03 కోట్లు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 9.91కోట్ల కోట్లు షేర్, రూ. 17.52 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ఇప్పటివరకు వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇప్పటివరకు వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఖిలాడి సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేయడంతో బిజినెస్ బాగానే చేసింది. కానీ టాక్ నెగిటివ్ గా రావడంతో బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ పెద్దగా రాలేవు. ఇక మిగతా రాష్ట్రాల్లో అయితే పెద్దగా వసూళ్లను సాధించలేదు. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 0.81 కోట్లు, ఓవర్సీస్‌లో 0.47 కోట్లు, హిందీలో 0.63 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఖిలాడి 12.24 కోట్ల షేర్ ను సాదించింది. ఇక 21.80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత రావాలంటే?

హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత రావాలంటే?

ఇక నిర్మాత ముందుగానే సినిమాను ఏరియాల వారిగా అమ్ముకోవడంతో సేఫ్ అయ్యాడు. బయ్యర్లు మాత్రం భారీగా లాస్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 24.80 కోట్లు మేర బిజినెస్ చేసిన ఖిలాడి మూవీ 25.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయ్యింది. ఇక 7 రోజుల్లో సినిమాకు 12.24 కోట్ల షేర్ మాత్రమే దక్కింది. ఇక బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 11.26 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X