twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Khiladi 10 Days Collections: ఖిలాడికి కలిసి రాని సండే.. రవితేజకు సినిమాకు మరో షాక్!

    |

    చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొని.. గత ఏడాది వచ్చిన 'క్రాక్'తో మరోసారి విజయాల బాట పట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో.. ఈ మాస్ హీరో అప్పటి నుంచి మరింత జోష్‌తో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే రవితేజ 'ఖిలాడి' అనే సినిమాలో నటించాడు. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

    ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుని పది రోజుల క్రితమే విడుదలైంది. అయితే, ఆరంభం నుంచే ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించింది. దీంతో ఈ చిత్రం తక్కువ కలెక్షన్లనే రాబడుతోంది. మరి ఈ సినిమా 10 రోజుల కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి మరి!

    ఖిలాడిగా సందడి చేసిన రవితేజ

    ఖిలాడిగా సందడి చేసిన రవితేజ

    మాస్ హీరో రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

    కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!

     ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఖిలాడి'కి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ అయింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 22.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

    10వ రోజు ఎంత వసూలు చేసింది?

    10వ రోజు ఎంత వసూలు చేసింది?

    రవితేజ ‘ఖిలాడి'కి 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కొంత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 29 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

    బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!

    10 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    10 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    10 రోజులకు ఖిలాడికి ఏపీ, తెలంగాణలో తక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షలతో కలుపుకుని రూ. 11.05 కోట్లు షేర్, రూ. 18.79 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    10 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 11.05 కోట్లు వసూలు చేసిన ‘ఖిలాడి'.. మిగిలిన చోట్లా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు, హిందీలో రూ. 70 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.10 కోట్లు షేర్, రూ. 23.35 కోట్లు గ్రాస్ మాత్రమే దక్కింది.

    హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

    Recommended Video

    Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
     టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.50 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజుల్లో దీనికి రూ. 13.10 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.40 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mass Maharaj Ravi Teja Did Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie Collect 13.10 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X