Khiladi 4 Days Collections: భారీగా పడిపోయిన ఖిలాడి వసూళ్లు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్
ఆ మధ్య కొన్ని వరుస పరాజయాలు ఎదురు కావడంతో తెగ ఇబ్బందులు పడ్డాడు మాస్ మహారాజా రవితేజ. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాను చేశాడు. చాలా బ్రేకుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. అలాగే, విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రం.. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలో మంచి టాక్‌ను అందుకున్నా.. ఆ తర్వాత క్రమంగా డల్ అయింది. దీంతో మూడు రోజుల్లోనూ 'ఖిలాడి'కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మరి ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందో మీరూ చూసేయండి!

‘ఖిలాడి'గా మాస్ హీరో సందడి
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్
క్రేజీ కాంబోలో వచ్చిన ‘ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 22.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

4వ రోజు ఎంత వసూలు చేసింది?
‘ఖిలాడి' మూవీకి 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 87 లక్షలు షేర్, రూ. 1.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి వచ్చిందెంత?
రవితేజ మూవీకి 4 రోజులకు ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 90 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో కలుపుకుని రూ. 8.63 కోట్లు షేర్, రూ. 14.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా
ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 8.63 కోట్లు వసూలు చేసిన ‘ఖిలాడి' మూవీ.. మిగిలిన చోట్లా ప్రభావాన్ని చూపలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 71 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు, హిందీలో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 10.04 కోట్లు షేర్, రూ. 18 కోట్లు గ్రాస్ దక్కింది.
Recommended Video

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.50 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లో దీనికి రూ. 10.04 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.46 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











