For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Khiladi 9 Days Collections: శనివారం షాకింగ్‌గా ఖిలాడి వసూళ్లు.. 23 కోట్లకు మొత్తంగా వచ్చింది ఇంతే!

    |

    సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత ఏడాది వచ్చిన 'క్రాక్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మాస్ మహారాజా రవితేజ. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందించింది. దీంతో ఈ సీనియర్ హీరో అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'ఖిలాడి' అనే సినిమాలో నటించాడు. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

    రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుని అంతకు ముందు వారమే విడుదలైంది. అయితే, ఆరంభం నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది. దీంతో టార్గెట్‌ను చేరుకునేందుకు కష్టపడుతోంది. మరి ఈ సినిమా 9 రోజుల కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

    ఖిలాడిగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ

    ఖిలాడిగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ

    టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమానే ‘ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

    బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!

    ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖిలాడి'కి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 22.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    9వ రోజు ఎంత వసూలు చేసింది?

    9వ రోజు ఎంత వసూలు చేసింది?

    9వ రోజు కూడా ‘ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వచ్చింది.

    హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

    9 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    9 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    ఖిలాడి మూవీకి 9 రోజులకు ఏపీ, తెలంగాణలో తక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 1.07 కోట్లు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 53 లక్షలతో కలుపుకుని రూ. 10.76 కోట్లు షేర్, రూ. 18.27 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 10.76 కోట్లు వసూలు చేసిన ‘ఖిలాడి'.. మిగిలిన చోట్లా ఎదురు గాలినే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 83 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు, హిందీలో రూ. 65 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.72 కోట్లు షేర్, రూ. 22.70 కోట్లు గ్రాస్ దక్కింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

    Recommended Video

    Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో దీనికి రూ. 12.72 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.78 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mass Maharaj Ravi Teja Did Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie Collect 12.72 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X