Khiladi Business: షాకింగ్‌గా ఖిలాడీ మూవీ బిజినెస్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు కష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారాడు రవితేజ. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఇక, కొంత కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన రవితేజ.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
కరోనా నిబంధనల ఉన్నా.. ఇది భారీ కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే అతడు ప్రస్తుతం 'ఖిలాడీ' అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

ఖిలాడీగా మారిన మాస్ మహారాజా
రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రమే ‘ఖిలాడీ'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

హిందీలోనూ ఖిలాడీ వస్తున్నాడు
గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమాల స్టామినా పెరిగిపోయింది. దీంతో మన సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఖిలాడీ' మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కడ కూడా గ్రాండ్‌గాన రిలీజ్ చేయబోతున్నారు.

భారీ రెస్పాన్స్.. అంచనాలు కూడా
‘ఖిలాడీ' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి కొన్ని పాటలను వదలగా వీటికి అన్ని వర్గాల్లో అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది.

‘ఖిలాడీ' బిజినెస్ కూడా భారీగా
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘ఖిలాడీ' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో అత్యధికంగానే డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని అంటున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
రవితేజ నటించిన ‘ఖిలాడీ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 21.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా జరిగింది ఇలా
మాస్ హీరో రవితేజకు ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఓవర్సీస్‌లో ‘ఖిలాడీ' మూవీకి రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.
Recommended Video

అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్
రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఖిలాడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.80 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25.50 కోట్లుగా ఉంది. అంటే.. అన్ని కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్‌ను మాత్రం నిర్మాతలే స్వయంగా విడుదల చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











