Just In
- 17 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 47 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
Don't Miss!
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Krack box office: థియేటర్స్ సగమే నిండినా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్.. రవితేజ కెరీర్‌లోనే న్యూ రికార్డ్
అసలే కరోనా భయం.. మళ్ళీ థియేటర్స్ 50% లిమిటేషన్ మాత్రమే. ఇక నిర్మాతకు ఫైనాన్షియల్ అడ్డంకులు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో క్రాక్ సినిమా కలెక్షన్స్ ఏ విదంగా ఉంటాయనేది మొదట్లో ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ తెలుగు ఆడియెన్స్ అభిమానం ముందు ఆ భయలన్నీ పోయాయి. సినిమాలపై జనాలకున్న అభిమానం ఏమిటో క్రాక్ సినిమాతో అర్ధమయ్యింది. పైగా సంక్రాంతి సెంటిమెంట్ బలం కూడా మరోసారి ఋజువయ్యింది.

మళ్ళీ అదే కంటిన్యూ అవుతోంది
మాస్ మహారాజా రవితేజ కెరీర్ మొత్తంలోనే క్రాక్ నెవర్ బిఫోర్ అనేలా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దుమ్ము దులిపి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ కమర్షియల్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఇక మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా తరువాత రోజు కూడా అదే కంటిన్యూ అవుతోంది.

మొదటి రోజు అడ్డంకులు వచ్చినా..
శనివారం గ్రాండ్ గా విడుదలవుతుందని అనుకున్న క్రాక్ సినిమా అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో మొదట రెండు షోలు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వలన వచ్చిన అడ్డంకులను తొలగించుకొని ఫైనల్ గా సినిమా ఫస్ట్ షోతో తన డామినేషన్ ఏమిటో చూపించింది. మొదటి రోజు రెండు షోలో ప్రదర్శించినప్పటికి 1కోటికి పైగా కలెక్షన్స్ వచ్చాయి.
Kingfisher Calendar 2021 Superhot Model Photos

మొత్తం షేర్స్ ఎంతంటే..
శనివారం రెండు షోలో పడడంతో ఆదివారం షోలతో కలిపి మొదటి రోజు కలెక్షన్స్ గా లెక్కల్లోకి తీసుకోగా మాస్ రాజా కెరీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన మొత్తం షేర్స్ రూ.6.25కోట్లు. కేవలం థియేటర్స్ 50% లిమిటేషన్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం బిగెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు.

గత రికార్డులు ఈ విధంగా ఉన్నాయి
ఒకవేళ అదే 100% ఆక్యుపెన్సీతో నడిచి ఉంటే ఇంకా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చి ఉండేవో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక గత సినిమాల మొదటి రోజు రికార్డుల విషయానికి వస్తే కిక్ 2 రూ.5.8కోట్లను అందుకోగా.. బెంగాల్ టైగర్ రూ.5.3కోట్లను రాబట్టింది. మిగతా సినిమాల విషయానికి వస్తే.. పవర్ రూ.5.5కోట్లు, రాజా ది గ్రేట్ 4.92కోట్లు, టచ్ చేసి చూడు 4.15కోట్లు.

మరింత పెరగనున్న కలెక్షన్స్
క్రాక్ కమర్షియల్ మాస్ హిట్ గా మంచి క్రేజ్ అందుకోవడంతో ఈ సంక్రాంతి సెలవులకు కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే థియేటర్స్ సంఖ్య కూడా పెరగవచ్చు. మరో మూడు రోజుల్లో మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ వంటి డిఫరెంట్ సినిమాలు కూడా కమర్షియల్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్నాయి. మరి క్రాక్ ఆ సినిమాలకు ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.