రవితేజ తెలుగు సినిమాలకు కన్నడంలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ రవితేజ హిట్ సినిమాలను ఉపేంద్ర కన్నడంలో చేసుకుంటున్నారు. తెలుగులో హిట్ అయిన సినిమాను కన్నడంలో రీమేక్ చేసుకోవడం చాలా సులభం. రవితేజ "దుబాయ్ శీను" కన్నడ వెర్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న ఉపేంద్ర, రవితేజ మరో సినిమా "కృష్ణ"ను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. "కృష్ణ" సినిమా రజనీ పేరుతో కన్నడంలో రీమేక కానుంది. ఇందులో ఆర్తి చాబ్రియా హీరోయిన్. కన్నడ సాహిత్యం చాలా గొప్పది. అక్కడ మహా రచయితలు ఉన్నారు. అయినా కన్నడ నిర్మాతలు తెలుగు సినిమాల రీమేక్ ల మీద ఆధారపడడం విచారకరం. మన తెలుగు సినిమా రచయితలు ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన మూల కథలు కన్నడం వారికి ప్రధానం కావడం బాధాకరమే.