Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka 1st Day Collections: ధమాకా బాక్సాఫీస్ గేమ్ స్టార్ట్.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో డబుల్ యాక్షన్ చూపించాడు. ఇక సినిమాకు టాక్ అయితే కాస్త డివైడ్ గానే వచ్చింది. కానీ చాలా చోట్ల మాత్రం ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

ధమాకా గ్రాండ్ రిలీజ్
రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఒకవైపు మాస్ మరొకవైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 670 థియేటర్లలో విడుదల చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధమాకా థియేటర్ల సంఖ్య 940 కి పైగానే ఉంటుందని తెలుస్తోంది.

బిజినెస్ ఎంతంటే?
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిజినెస్ అయితే బాగానే చేసింది. మాస్ మహారాజు రవితేజ గత రెండు సినిమాలతో ఊహించని స్థాయిలో డిజాస్టర్స్ ఉండకున్నప్పటికీ కూడా ధమాకా సినిమాకు మంచి బిజినెస్ జరగడం విశేషం. ధమాకా ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 19 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.

నెగిటివ్ టాక్
ఇక మొదటి రోజు బీసీ సెంటర్లలో అయితే చాలావరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ అందినట్లు తెలుస్తోంది. రివ్యూలు అయితే చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. మాస్ హీరోగా రవితేజ ఎప్పటిలానే మళ్లీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అని క్రిటిక్స్ నుంచి ఊహించని రియాక్షన్ అయితే వచ్చింది. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమిచ్చింది.

థియేటర్ ఆక్యుపెన్సి
ఇక ఈ సినిమా ఉదయం షోలకు 32.67 శాతం థియేటర్ ఆక్యుపెన్సి తో కొనసాగగా ఆ తర్వాత మధ్యాహ్నం హడావుడి కాస్త తగ్గింది. ఇక సాయంత్రం షోలకు వచ్చేసరికి ధమాకా సినిమాకు 42.35% వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. ఒక విధంగా మాస్ మహారాజా వరుసగా రెండు సినిమాలతో నిరాశపరిచినప్పటికీ కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ నుంచి అయితే మాస్ ఆడియన్స్ ఈ సినిమాను ఎక్కువగా చూసినట్లు తెలుస్తోంది.

తొలి రోజు కలెక్షన్స్
ఇక
మాస్
మహారాజ
రవితేజ
ధమాకా
సినిమా
మొదటి
రోజు
ఎంత
వసూలు
చేసింది
అనే
వివరాల్లోకి
వెళితే..
మాస్
కమర్షియల్
ఎంటర్టైనర్
గా
వచ్చిన
ధమాకా
సినిమాకు
సాంగ్స్
కొంత
బజ్
తీసుకు
వచ్చాయి.
దీంతో
ఓపెనింగ్స్
కలెక్షన్స్
కూడా
బాగానే
వచ్చాయి.
మొత్తంగా
ఈ
సినిమా
మొదటి
రోజు
ప్రపంచ
వ్యాప్తంగా
4
కోట్ల
నుంచి
6
కోట్ల
మధ్యలో
నెట్
కలెక్షన్స్
సొంతం
చేసుకున్నట్లుగా
తెలుస్తోంది.
శని
కూడా
ఇదే
తరహాలో
కలెక్షన్స్
పెరిగితే
ఈజీగా
ప్రాఫిట్
జాన్
లోకి
వచ్చే
అవకాశం
ఉంటుంది.
ఇక
శనివారం
ఉదయం
ఏరియాల
వారిగా
అసలు
కలెక్షన్
నెంబర్స్
అప్డేట్
అవుతాయి.