Ramarao On Duty 2 Days Collections: రవితేజకు భారీ దెబ్బ.. ఎక్కడ 3 కోట్లు.. ఎక్కడ 50 లక్షలు సామీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా వెలుగొందుతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అయితే, ఆ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'క్రాక్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

రామారావుగా ఎంటరైన మాస్ హీరో
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మందవ తెరకెక్కించిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు.

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ నటించిన మాస్ యాక్షన్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు భారీ దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 46 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలైంది.

2 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది
'రామారావు ఆన్ డ్యూటీ'కి ఏపీ, టీఎస్‌లో రెండో రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 59 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలుపుకుని రూ. 3.28 కోట్లు షేర్, రూ. 5.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో కేవలం రూ. 3.28 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.85 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రవితేజ - శరత్ కలయికలో రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.96 కోట్లు వచ్చాయి. అంటే మరో 14.04 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

కోట్ల నుంచి లక్షలకు పడిందిగా
'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా నిరాశను కలిగించేలా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో అంతగా రాణించడం లేదు. దీనికి మొదటి రోజులు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.82 కోట్లు వసూలు అయ్యాయి. కానీ, రెండో రోజు మాత్రం కేవలం రూ. 46 లక్షలే వచ్చాయి. ఇది ఈ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











