Ramarao On Duty 5 Days Collections: రవితేజకు మరో షాక్.. 5వ రోజే ఇంత ఘోరమా.. అన్ని కోట్లు వస్తేనే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాస్ మహారాజా రవితేజది మాత్రమే. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా ఎదిగిన ఆయన.. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అభిమానాన్ని చూరగొన్నాడు. అలా సుదీర్ఘ కాలంగా ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ఫలితంగా కలెక్షన్లు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

రామారావుగా ఎంటరైన రవితేజ

రామారావుగా ఎంటరైన రవితేజ

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు.

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్

రవితేజ మార్కెట్‌ను బట్టి 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల మేర బిజినెస్‌ను జరుపుకుంది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందని 'రామారావు ఆన్ డ్యూటీ'కి ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి వసూళ్లు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5వ రోజు రవితేజ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 16 లక్షలే వచ్చాయి.

5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ'కి 5 రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 69 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలుపుకుని రూ. 4.03 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

5 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో కేవలం రూ. 4.03 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 47 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.83 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.17 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X