Ramarao On Duty 6 Days Collections: రవితేజకు భారీ దెబ్బ.. ఇక తేరుకోవడం కష్టమే.. అన్ని కోట్లు నష్టం!
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన తర్వాత స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు చాలా దగ్గరయ్యే సినిమాలు చేసి మాస్ మహారాజా అనిపించుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. 'క్రాక్'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలతో యమ జోష్ మీద కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు.. ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ఫలితంగా కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 6 రోజుల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

రామారావుగా డ్యూటీ ఎక్కిన హీరో
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ మార్కెట్‌కు అనుగుణంగానే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల మేర బిజినెస్‌ను చేసుకుంది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత
సందేశాత్మక కథతో క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ'కి ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కడం లేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీనికి వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 6వ రోజు రవితేజ సినిమాకు కలిపి కేవలం రూ. 11 లక్షలే వచ్చాయి.

6 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది
'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లోనూ నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 71 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలుపుకుని రూ. 4.14 కోట్లు షేర్, రూ. 7.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో కేవలం రూ. 4.14 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 34 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 49 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.97 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.75 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రవితేజ హీరోగా శరత్ మందవ తీసిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.97 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.03 కోట్లు వస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది.

అన్ని కోట్ల నష్టాలు తప్పేలా లేవు
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ నిరాశే ఎదురవుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ బాక్సాఫీస్ ముందు తేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రానికి రూ. 10 కోట్లు పైగా నష్టాలొచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











