twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao On Duty 8 Days Collections: రవితేజకు ఘోరం పరాభవం.. 8వ రోజు ఇంతేనా.. అన్ని కోట్ల నష్టం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా కాలం పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత హీరోగా మారిన రవితేజ.. ఆరంభంలోనే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు.

    ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇలా గత వారమే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 8 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

    రామారావుగా వచ్చేసిన రవితేజ

    రామారావుగా వచ్చేసిన రవితేజ

    టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. ఇందులో అప్పటి హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను పోషించాడు.

    డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారంటే!డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారంటే!

    బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్

    బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్

    రవితేజ మార్కెట్‌ అనుగుణంగానే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల మేర బిజినెస్‌ను జరుపుకుంది.

    8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత

    8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత

    మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కడం లేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించింది. దీంతో ఓపెనింగ్ డే నుంచే ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ రోజు ఈ చిత్రానికి కేవలం రూ. 4 లక్షలే వచ్చాయి.

    'ఖిలాడి' హీరోయిన్ హాట్ వీడియో వైరల్: లోదుస్తులు కూడా తీసేసి ఘోరంగా!'ఖిలాడి' హీరోయిన్ హాట్ వీడియో వైరల్: లోదుస్తులు కూడా తీసేసి ఘోరంగా!

    8 రోజులకు ఎంత వచ్చిందంటే

    8 రోజులకు ఎంత వచ్చిందంటే

    'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లోనూ నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 73 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి రూ. 4.24 కోట్లు షేర్, రూ. 7.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    8 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 4.24 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.09 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.99 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీనువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    రవితేజ హీరోగా శరత్ మందవ కలయికలో వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో ఈ సినిమాకు రూ. 5.09 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.91 కోట్లు వస్తేనే ఇది హిట్‌‌ అవుతుంది.

    English summary
    Mass Maharaj Ravi Teja Did Ramarao On Duty Under Sarath Mandava Direction. This Movie Collects Rs 5.09 Crores in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X