Ramarao On Duty 9 Days Collections: శనివారం షాకింగ్ వసూళ్లు.. 9రోజులకు ఇంతే.. అన్ని కోట్లు వస్తేనే!
దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. హీరోగా మారిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మాస్ ఇమేజ్‌ను దక్కించుకుని భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ జోష్‌లోనే రవితేజ ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన తగ్గిపోయింది. ఫలితంగా కలెక్షన్లు డల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' 9 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

రామారావుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో అప్పటి హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు.

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ మార్కెట్ ప్రకారమే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల మేర బిజినెస్‌ను చేసుకుంది.

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కడం లేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించింది. దీంతో ఓపెనింగ్ డే నుంచే ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 9వ రోజు ఈ చిత్రానికి కేవలం రూ. 5 లక్షలే వసూలు అయ్యాయి.

9 రోజులకు ఎంత వచ్చిందంటే
'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లోనూ భారీ దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 1.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 73 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి రూ. 4.28 కోట్లు షేర్, రూ. 7.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
9 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 4.28 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 37 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.12 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రవితేజ - శరత్ మందవ కాంబినేషన్‌లో రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో ఈ సినిమాకు రూ. 5.15 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.85 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











