twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao On Duty Total Collections: 18 కోట్ల టార్గెట్.. రవితేజ కెరీర్‌లో చెత్తగా.. అన్ని కోట్ల నష్టం

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్‌గా వెలుగొందుతోన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఈ ఏడాది ఆరంభంలోనే 'ఖిలాడి' అనే సినిమాతో వచ్చిన రవితేజ.. ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.

    ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా రాలేదు. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    రామారావుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్

    రామారావుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్

    టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించాడు.

    రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

    రవితేజ సినిమా బిజినెస్ డీటేల్స్

    రవితేజ సినిమా బిజినెస్ డీటేల్స్

    రవితేజ మార్కెట్ అనుగుణంగానే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

     అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

    అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

    మాస్ మహారాజా - శరత్ మందవ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిందన్న విషయం తెలిసిందే.

    ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

    రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాలు

    రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాలు

    'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 73 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలుపుకుని రూ. 4.31 కోట్లు షేర్, రూ. 7.40 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

     ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో కేవలం రూ. 4.31 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 37 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.25 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!

     బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 5.20 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి మరో 12.50 కోట్లు నష్టాలు మిగిలాయి.

    ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీగా

    ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీగా

    రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ ఇటీవలే ఓ ప్రకటన చేసింది. దీన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందులో వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా రెడీ చేసిన ఓ ట్రైలర్‌ను కూడా సదరు సంస్థ విడుదల చేసింది. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

    English summary
    Mass Maharaj Ravi Teja Did Ramarao On Duty Under Sarath Mandava Direction. This Movie Collects Rs 4.38 Crores in Full Run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X