RamaRao On Duty Theatrical Bussiness: డిజాస్టర్ వచ్చినా మాస్ రాజా అదే లెవెల్.. బిగ్ టార్గెట్!
మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఈ సినిమాతో ఎలాగైనా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. ఎందుకంటే ఇదివరకు వచ్చిన ఖిలాడి సినిమా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు వచ్చిన క్రాక్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వరుస అపజయల్లో ఉన్న రవితేజకు ఆ సినిమా ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి తీసుకు వచ్చింది. దీంతో ఇప్పుడు రవితేజ ఆశలన్నీ కూడా రామారావు సినిమా పైనే ఉన్నాయి.
ఇక ఈ సినిమాకు మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు చెప్పుకోదగ్గ విధంగా ప్రమోషన్ కూడా చేసింది లేదు. అయినప్పటికీ కూడా మార్కెట్లో బిజినెస్ బాగానే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 18 నుంచి 20 కోట్ల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ అయితే అభిమానుల్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

ఇక అందరూ కూడా ప్రస్తుతం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ పై కూడా రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా శరత్ కొంత డిఫరెంట్ గానే సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ స్థాయిలోనే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఖిలాడి సినిమాతో రవితేజ కెరీర్ లోనే మరొక దారుణమైన పరాజయాన్ని అందుకున్నప్పటికీ మళ్ళీ రామారావు సినిమాతో మాత్రం మంచి బిజినెస్ చేస్తుండడం విశేషం. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి నాకు తగ్గట్టుగా లాభాలను అందిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











