Ravanasura 6 Days Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. రవితేజ హిట్ కొట్టాలంటే మాత్రం?
వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది డిసెంబరులో ధమాకాతో డబుల్ ట్రీట్ ఇచ్చిన రవితేజ 2023లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో సందడి చేశాడు. మళ్లీ అతి తక్కువ సమయంలోనే రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలై రవితేజ రావణాసుర సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఫలితంగా వసూళ్లు సోసోగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రావణాసుర 6 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
కీలక పాత్రలు-బ్యానర్:మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యూయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్, జయ ప్రకాష్ తదితరులు నటించారు. దీన్ని అభిషేక పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్:రవితేజ రావణాసుర సినిమాకు ఆయన మార్కెట్ కు తగినవిధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 7 కోట్లు, సీడెడ్ లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో మొత్తం రూ. 10 కోట్లు ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాతోపాటు ఓవర్సీస్ లో రూ. 2. 20 కోట్ల వరకు బిజినెస్ అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 22. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రూ. 23 కోట్లకు బ్రేక్ ఈవెన్ ఫిక్స్ అయింది.
6వ రోజు వసూళ్లు:రావణాసుర సినిమాకు 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణ, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 31 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే గత ఐదు రోజుల వసూళ్లతో పోల్చుకుంటే ఆరో రోజున రవితేజ రావణాసుర మూవికి అతి తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది..

6 రోజులకు కలిపి:రవితేజ ఇతర సినిమాలకు భిన్నంగా రావణాసుర అతి తక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ మూవీకి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3.95 కోట్లు, సీడెడ్ రూ. 1.44 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.34 కోట్లు, ఈస్ట్ గోదావరి, రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 45 లక్షలు, గుంటూరు రూ. 75 లక్షలు, కృష్ణ రూ. 54 లక్షలు, నెల్లూరు రూ. 32 లక్షలు వచ్చాయి. ఇక మొత్తంగా 6 రోజుల్లో రూ. 9.49 కోట్ల షేర్, రూ. 16.05 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.
వరల్డ్ వైడ్ గా:రవితేజ రావణాసుర సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ సినిమాపై విపరీతమై నెగెటివ్ టాక్ వచ్చేసరికి రోజురోజుకీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఇక 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.49 కోట్ల షేర్ రాగా కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 83 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 1.09 కోట్లు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రూ. 11.41 కోట్ల షేర్, రూ. 20.65 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయగలిగింది. అంటే సినిమా హిట్ కొట్టాలంటే రూ. 11.59 కోట్లు రావాల్సింది.


Click it and Unblock the Notifications











