Ravanasura Collections: ఇది ఊహించలేదు రాజా.. 2వ రోజు ఊహించని దెబ్బ.. ఇంకా ఎంత రావాలంటే?
మాస్ మహారాజ రవితేజ నటించిన డిఫరెంట్ త్రిల్లర్ యాక్షన్ మూవీ రావణాసుర ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. అయినప్పటికీ కూడా మాస్ రాజా తన ఫాలోయింగ్ తో మంచి ఓపెనింగ్స్ అయితే అందించాడు.
ఇక ఈ సినిమా రెండవ రోజు మాత్రం ఊహించని దెబ్బను ఎదుర్కోబోతున్నట్లు ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇక మొత్తంగా రావణాసుర రెండవ రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే: సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ బిజినెస్ అయితే చేసింది. మాస్ రాజా రవితేజ మార్కెట్ కు తగ్గట్టుగానే నైజాంలో 7 కోట్లు, సీడేట్లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మొత్తంగా 2.20 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ 23 కోట్లకు ఫిక్స్ అయింది.
రెండవ రోజు ఏపీ-నైజాం లెక్క: రావణాసుర ఏపీ నైజాంలో మొత్తంగా 700 కు పైగా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా ఏరియాల వారిగా మొదటి రోజు బాగానే కలెక్షన్స్ వచ్చినప్పటికీ రెండవ రోజు మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక రెండవ రోజు ఏరియాలో వారీగా షేర్ చూసుకుంటే నైజాంలో 1 కోటి, సీడెడ్ లో 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 25 లక్షలు, ఈస్టులో 20 లక్షలు, వెస్టులో 10 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణలో 12 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 2.50 కోట్ల కంటే తక్కువగానే లోనే షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

కర్ణాటక, ఓవర్సీస్ కలెక్షన్స్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రావణాసుర సినిమా రెండవ రోజు కాస్త తక్కువగానే కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండు రోజుల్లో కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 35 లక్షల రేంజ్ లోనే షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే అక్కడ కూడా రెండవ రోజు భారీగా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు రోజుల్లో 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా: మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రావణాసుర సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ నెగటివ్ టాక్ ఎక్కువగా రావడంతో రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే రెండు రోజుల్లో దాదాపు 3 కోట్ల లోపే షేర్ కలక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లో సినిమాకు మొత్తంగా 7 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు సమాచారం.

ఇంకా ఎంత రావాలంటే: రావణాసుర సినిమా ప్రపంచవ్యాప్తంగా రవితేజ మార్కెట్ కు తగ్గట్టుగానే 22.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లకు ఫిక్స్ కాగా సినిమా ఇప్పటివరకు అయితే 7 కోట్ల రేంజ్ లో షేక్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 15 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా ఈ ఆదివారం ఎంత కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











