Ravanasura Collections: 3వ రోజు మరీంత తగ్గిన కలెక్షన్స్.. 100 కోట్ల హిట్ చూసిన తరువాత ఏంటీ రాజా ఇది!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది టాలెంటెడ్ యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు కొంత డిఫరెంట్ చేసుకుంది సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో రవితేజ నేవర్ బిఫార్ అనే పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్దనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోవడం లేదు. మొదటి రోజు కంటే రెండో రోజు చాలా తగ్గిపోయాయి ఇక మూడవరోజు ఈ సినిమా ఊహించని విధంగా మరింత డౌన్ అయిపోయింది ఇక మొత్తంగా ఇప్పటివరకు ఈ సినిమాకు ఎంత వచ్చాయి సక్సెస్ కావాలి అంటే ఇంకా ఎంత వసూలు చేయాలి అనే వివరాల్లోకి వెళితే..

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..: ధమాకా సినిమాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కెట్ ను అందుకున్న రవితేజకు ఈ మధ్య మరింత డిమాండ్ పెరిగింది. ఇక రావణాసుర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే చేసింది. నైజాంలో 7 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 2.20 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ 23 కోట్లకు ఫిక్స్ అయింది.

Ravi teja ravanasura movie day 3 worldwide box office collections

3వ రోజు ఏపీ-నైజాం కలెక్షన్స్: రావణాసుర ఏరియాల వారిగా రెండవ రోజు కలెక్షన్స్ మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక మూడవ రోజు కూడా డౌన్ అయ్యింది. ఏరియాలో వారీగా షేర్ చూసుకుంటే నైజాంలో 89 లక్షలు, సీడెడ్ లో 42 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్టులో 19 లక్షలు, వెస్టులో 11 లక్షలు, గుంటూరులో 12 లక్షలు, కృష్ణలో 9 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు 2 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

3 రోజుల్లో ఏపి నైజాం కలెక్షన్స్: రావణాసుర 3 రోజుల్లో ఏపీ తెలంగాణలో ఊహించినంత కలెక్షన్స్ ఏమి అందుకోలేదు. నెగిటివ్ టాక్ ఎక్కువ రావడంతో చాలా వరకు తగ్గాయి. ఇక నైజాంలో 2.53 కోట్లు, సీడెడ్ 1.12 కోట్లు, ఉత్తరాంధ్ర 1 కోటి, ఈస్ట్ 49 లక్షలు, వెస్ట్ 35 లక్షలు, గుంటూరు 59 లక్షలు, కృష్ణ 32 లక్షలు, నెల్లూరు 22 లక్షలు వచ్చాయి. ఇక మొత్తంగా ఎపి తెలంగాణలో మూడు రోజుల్లో 8 కోట్ల రేంజ్ లో షేర్, 12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

Ravi teja ravanasura movie day 3 worldwide box office collections

మిగతా రాష్ట్రాల్లో..: తెలుగు రాష్ట్రాల్లో రావణాసుర సినిమా కాస్త తక్కువగానే కలెక్షన్స్ అందుకుంది. ఇక మూడు రోజుల్లో కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 65 లక్షల రేంజ్ లోనే షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 3వ రోజు భారీగా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా 3 రోజుల్లో 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

టోటల్ కలెక్షన్స్: రావణాసుర సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ నెగటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇక 3వ రోజు కూడా కలెక్షన్స్ ఏమి పెరగలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే 3 రోజుల్లో దాదాపు 2.50 కోట్ల లోపే షేర్ కలక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే మూడు రోజుల్లో సినిమాకు మొత్తంగా 9.50 కోట్లకు పైగా షేర్, గ్రాస్ 15 కోట్లు వచ్చినట్లు సమాచారం.

Ravi teja ravanasura movie day 3 worldwide box office collections

లాభాల్లోకి రావాలి అంటే..: రావణాసుర రవితేజ మార్కెట్ కు తగ్గట్టుగానే 22.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లకు సెట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా సినిమా 3 రోజుల్లో 9 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా వీకెండ్ అనంతరం ఎంత కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X