Ravanasura Collections: 4వ రోజు కూడా కలెక్షన్స్ దారుణంగా డౌన్.. ఆ రేంజ్ నష్టాలు తప్పేలా లేవు!
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఊహించిన స్థాయిలో నెగిటివ్ టాక్ సొంతం చేసుకునే సస్పెన్స్ థ్రిల్లర్ గా యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది కానీ సినిమా మాత్రం జనాలను తల క్రిందలు చేస్తూ డివైడ్ టాక్స్ అంతం చేసుకుంది దీంతో కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఇక నాలుగో రోజు కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ పెరగలేదు దీంతో సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్:ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ రావణాసుర సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాలని అనుకున్నాడు. ఇక రావణాసుర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే చేసింది. నైజాంలో 7 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో 2.20 కోట్ల వరకు బిజినెస్ చేసింది. రావణాసుర సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ 23 కోట్లకు ఫిక్స్ అయింది.

4వ రోజు ఏపీ-నైజాం కలెక్షన్స్:రావణాసుర సినిమాకు వీకెండ్ లోనే కలెక్షన్స్ మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక సోమవారం నుంచి కూడా డౌన్ అయ్యాయి. ఇక 4వ రోజు ఏరియాలో వారీగా షేర్ చూసుకుంటే.. నైజాంలో 20 లక్షలు, సీడెడ్ లో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 9 లక్షలు, ఈస్టులో 11 లక్షలు, వెస్టులో 7 లక్షలు, గుంటూరులో 5 లక్షలు, కృష్ణలో 9 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 60 లక్షల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
4 రోజుల్లో ఏపి నైజాం కలెక్షన్స్:రావణాసుర 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించినంత కలెక్షన్స్ ఏమి అందుకోలేదు. ఇక నెగిటివ్ టాక్ ఎక్కువ రావడంతో చాలా వరకు నెంబర్స్ తగ్గాయి. ఇక నైజాంలో 3.40 కోట్లు, సీడెడ్ 1.34 కోట్లు, ఉత్తరాంధ్ర 1.40 కోట్లు, ఈస్ట్ 70 లక్షలు, వెస్ట్ 41 లక్షలు, గుంటూరు 67 లక్షలు, కృష్ణ 50 లక్షలు, నెల్లూరు 35 లక్షలు వచ్చాయి. ఇక మొత్తంగా ఎపి తెలంగాణలో మూడు రోజుల్లో 8.32 కోట్ల రేంజ్ లో షేర్, 13.85 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

అక్కడ ఎంత వచ్చాయంటే..:తెలుగు రాష్ట్రాల్లో రావణాసుర సినిమాకు ఒపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఆ తరువాత మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. కానీ 4 రోజుల్లో కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 67 లక్షల రేంజ్ లోనే షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 4వ రోజు భారీగా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా 3 రోజుల్లో 99 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్:రావణాసుర సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే యావరేజ్ టాక్ ఉన్నా కూడా కొంత కలెక్షన్స్ పెరుగుతూ వచ్చేవి. కానీ నెగటివ్ టాక్ ఎక్కువ రావడంతో రెండవ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇక 4వ రోజు కూడా కలెక్షన్స్ ఏమి పెరగలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే 4వ రోజు దాదాపు 80 లక్షల లోపే షేర్ కలక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే 4 రోజుల్లో సినిమాకు మొత్తంగా 10 కోట్లకు పైగా షేర్, గ్రాస్ 18 కోట్లు వచ్చినట్లు సమాచారం.

నష్టాలు వచ్చేలా..:రావణాసుర డిమాండ్ కు తగ్గట్టుగానే 22.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లకు సెట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల్లో 10 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 12 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి రవితేజ రావణాసుర వీకెండ్ అనంతరం ఎంత కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











