రావణాసురతో దారుణంగా నష్టపోయిన హీరో రవితేజ.. మొత్తం ఎంత డబ్బు పోయిందంటే?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడు. ఇక ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రావణాసుర సినిమా విడుదలకు ముందు కొంత హైప్ క్రియేట్ చేసింది కానీ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది.

సినిమాకు మొదటి రోజు తప్పితే మిగతా రోజుల్లో పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఈ సినిమాకు అభిషేక్ నామతో కలిసి రవితేజ నిర్మించారు. ఇక ఈ సినిమాకు బయట డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా రవితేజ అలాగే నిర్మాత అభిషేక్ ఇద్దరు కూడా సొంతంగా విడుదల చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఎక్కడ కూడా సినిమాను అమ్మకుండా ప్రపంచవ్యాప్తంగా సొంతంగానే రిలీజ్ చేసుకున్నారు.

Ravi Teja ravanasura movie disaster talk with huge losses

అయితే సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో దారుణమైన నష్టాలు వచ్చాయి. రవితేజ కథ విన్నప్పుడు తనే సొంతంగా సినిమాలను నిర్మించాలనుకున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మను అతను ఎంతగానో నమ్మాడు. కానీ ప్లాన్ మొత్తం డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమాకు దాదాపు థియేట్రికల్ గా అయితే 10 కోట్ల వరకు నష్టాలు రాగా పెట్టిన ఓవర్ బడ్జెట్ కారణంగా మరో 10 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే రవితేజ దాదాపు 20 కోట్ల వరకు రావణాసుర సినిమా ద్వారా నష్టపోయారు.

అయితే సినిమాకు నాన్ థియేట్రికల్ గా కొంత బిజినెస్ జరగడం ద్వారా ఆ నష్టాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఓటిటి శాటిలైట్ పరంగా సినిమాకు మరికొంత డబ్బు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా రవితేజ రావణాసుర సినిమాపై థియేట్రికల్ గా భారీ స్థాయిలో లాభాలను అందుకుంటుందని ఆశపడ్డాడు. కానీ ఊహించిన విధంగా సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ ఏమాత్రం పెరగలేదు. ఇక నెక్స్ట్ రవితేజ నుంచి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X