Ravanasura Pre Release Bussiness: మాస్ రాజా మరో బిగ్ టార్గెట్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలంటే?
మాస్ మహారాజ రవితేజ వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న తర్వాత ఇప్పుడు మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా సినిమాతో సోలోగా సక్సెస్ కొట్టి అనంతరం వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ తో మరో సక్సెస్ ను షేర్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ క్రైమ్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రావణాసుర సినిమాతో కూడా మరో హిట్ అందుకోవాలి అని చూస్తున్నాడు.
ఈ సినిమాపై వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక ఈ సినిమా మొత్తంగా ఎన్ని థియేటర్లలో విడుదలవుతోంది అలాగే బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...

మొదట్లోనే మంచి హైప్: రవితేజ రావణాసుర సినిమాను అభిషేక్ నామ నిర్మించారు. అంతేకాకుండా రవితేజ RT టీమ్ వర్క్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా శ్రీకాంత్ కథను అందించారు. ఇక మొదటి టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న రావణాసుర సినిమా ట్రైలర్ ద్వారా కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది.
థియేటర్స్ సంఖ్య: ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన విడుదలవుతున్న రావణాసుర సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ అందుకున్నా కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ధియేటర్స్ వివరాలలోకి వెళితే నైజాంలో 235 థియేటర్లో విడుదలవుతున్న రావణాసుర సినిమా సీడెడ్ లో 165, ఆంధ్రలో 300 థియేటర్స్ లో..
ఇక మొత్తంగా ఏపీ తెలంగాణలో 700కు పైగా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక కర్ణాటకలో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 ధియేటర్లు, ఓవర్సీస్ లో 150 థియేటర్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 925 కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఆంధ్ర నైజాం బిజినెస్: రావణాసుర సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నైజాం ఏరియాలో 7 కోట్లు, సీడెడ్ లో మొత్తంగా మూడు కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ఆంధ్రలో చూసుకుంటే కూడా దాదాపు 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలుపుకొని రావణాసుర సినిమా 20 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లు సమాచారం.

టార్గెట్ ఎంతంటే: ఇక రావణాసుర సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. రవితేజ మార్కెట్ కు తగ్గట్టుగా ఇది సరైన రేంజ్ లోనే బిజినెస్ చేసింది. ఇక రావణాసుర సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే మొత్తంగా 23 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ధమాకా సినిమాతో 100 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న రవితేజ ఆ తర్వాత మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











