అమర్ అక్బర్ ఆంథోని యూఎస్ కలెక్షన్లు.. ఆ వసూళ్లను టచ్ చేయని రవితేజ!
అమెరికా బాక్సాఫీస్ వద్ద అమర్ అక్బర్ ఆంథోని చిత్రానికి ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా కనిపిస్తున్నది. మైత్రీ మూవీస్ రూపొందించిన ఈ చిత్రానికి భారీగా రెస్పాన్స్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ గురువారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్లకు గొప్పగా స్పందన కనిపించలేకపోయింది. దీంతో యూఎస్ మార్కెట్‌లో ప్రేక్షకులను రవితేజ ఆకట్టుకోలేకపోయారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీస్ బ్యానర్లలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో అమర్ అక్బర్ ఆంథోని రూపొందడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.1.60 కోట్లకు అమ్మడం జరిగింది. ఈ చిత్రాన్ని అమెరికాలో 110 స్క్రీన్లలో ప్రీమియర్లను ప్రదర్శించారు.

యూఎస్ ప్రీమియర్ల ద్వారా
గురువారం ప్రదర్శించిన ప్రీమియర్లకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. కడపటి వార్తలు అందేసరికి యూఎస్‌లో 86 లోకేషన్లలో అరవింద సమేత 57 వేల డాలర్లకుపైగా రాబట్టినట్టు సమాచారం.

రాజా ది గ్రేట్ మూవీ కలెక్షన్లు
అమర్ అక్బర్ ఆంథోని కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే తన కెరీర్‌లో మోస్తారు వసూళ్లను చెప్పుకోవచ్చు. గతంలో రాజా ది గ్రేట్ చిత్రం 90 స్క్రీన్లలో $117,400 వసూలు చేసింది. టచ్ చేసి చూడు ప్రీమియర్లను అధిగమించలేకపోయినట్టు సమాచారం. టచ్ చేసి చూడు సినిమా ప్రీమియర్ల ద్వారా $71,409 సంపాదించింది.

అమర్ అక్బర్ ఆంథోనిపై మిశ్రమ స్పందన
అమర్ అక్బర్ ఆంథోని సినిమాపై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. కథ, కథనాలు ఆకట్టుకొనేలా లేవనే మాట బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే శుక్ర, శని, ఆదివారాల్లో గట్టిగా వసూళ్లు సాధించాలనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











