అఫీషియల్ : రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' విడుదల తేదీ

By Srikanya

హైదరాబాద్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. సంపత్‌నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 27న 'బెంగాల్‌ టైగర్‌' ప్రేక్షకుల ముందుకు రానుందని అఫీషియల్ గా దర్శకుడు ప్రకటించారు.


అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది.

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.

దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

Ravi Teja's Bengal Tiger: Release on 27th November

ఈ సినిమా సరికొత్త థియోటర్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారు ఈ ఒక్కటి చాలు బిజినెస్ అవ్వటానికి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు. సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.

ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజాను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా. త‌మ‌న్న త‌న అంద‌చందాల‌తో మురిపించ‌బోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X