Khiladi Day 1 Collection: రవితేజ సినిమాకు బిగ్ షాక్.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఆరో స్థానంలో!

గత ఏడాది 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని యమ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాలో నటించాడు. ఎన్నో ఆటంకాల నడుమ సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. అప్‌డేట్ల ఇస్తూ అంచనాలను ఏర్పరుచుకున్న ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలో మంచి టాక్‌ను అందుకున్నా.. ఆ తర్వాత క్రమంగా డల్ అయింది. దీంతో మొదటి రోజు 'ఖిలాడి'కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి!

Recommended Video

Khiladi Movie Review రవితేజ కి మరో ఫ్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ | Filmibeat Telugu
 ఖిలాడిగా వచ్చిన మాస్ మహారాజా

ఖిలాడిగా వచ్చిన మాస్ మహారాజా

స్టార్ హీరో రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే.

ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్


రవితేజ నటించిన ‘ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

రవితేజ మూవీకి ఊహించని టాక్

రవితేజ మూవీకి ఊహించని టాక్

రవితేజ హీరోగా.. రమేష్ వర్మ తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి'. భారీ అంచనాల నడుమ ఈ యాక్షన్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఇది గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ దక్కడం షాక్‌కు గురి చేస్తోంది.

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల వసూళ్లు

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల వసూళ్లు

‘ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.30 కోట్లు షేర్, రూ. 6.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దానికంటే తక్కువే అంటే రూ. 4.30 కోట్లు వసూలు చేసిన ‘ఖిలాడి' ప్రపంచ వ్యాప్తంగా బాగానే రాణించినట్లు తెలుస్తోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో యాభై లక్షలకు పైగానే వసూలు చేసిందట. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 5.50 కోట్లు వచ్చినట్లు తెలిసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎం రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎం రావాలి?

రవితేజ హీరోగా వచ్చిన ‘ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.50 కోట్లు వరకూ రాబట్టింది. అంటే మరో 20 కోట్లు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆరో స్థానానికి పడిపోయిన ఖిలాడి

ఆరో స్థానానికి పడిపోయిన ఖిలాడి

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న రవితేజ.. తన సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంటున్నాడు. ఇలా గత ఏడాది ‘క్రాక్'తో కెరీర్‌లో హయ్యస్ట్ నెంబర్లను చేరుకున్నాడు. ఈ చిత్రం రూ. 6.25 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత కిక్ 2, బెంగాల్ టైగర్, పవర్, రాజా ది గ్రేట్, ఖిలాడి చిత్రాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X