twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ravi Teja's Khiladi హాట్ కేకుల్లా థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్ల బిజినెస్ అంటే? బాలీవుడ్‌లకి మాస్ మహారాజా!

    |

    మాస్ మహారాజా రవితేజ హీరోగా పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కొనేరు, రమేశ్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఖిలాడీ. యాక్షన్, క్రైమ్‌తోపాటు రొమాంటిక్ అంశాలు కలబోసిన చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి బిజినెస్, క్రేజ్‌ను, అంచనాలను పెంచుకొన్నది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఈ సినిమా బిజినెస్ గురించి పెన్ మూవీస్ ఆసక్తికరమైన ట్విట్ చేసింది. ఆ ట్వీట్, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

    హిందీలోకి రవితేజ ఎంట్రీ

    హిందీలోకి రవితేజ ఎంట్రీ

    బాహుబలి, సాహో, కేజీఎఫ్, పుష్ప చిత్రాల తర్వాత బాలీవుడ్‌లో దక్షిణాది హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఓపెన్ అయింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పుష్ప సాధిస్తున్న వసూళ్లు మిగితా నిర్మాతలకు, హీరోలకు మంచి ఎంకరేజ్‌గా మారాయి. అలాగే రవితేజ నటించిన సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తే ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. క్రాక్ సినిమా తర్వాత మరింత క్రేజ్ పెరిగింది. దాంతో రవితేజ హిందీ మార్కెట్‌పై కన్నేయడమే కాకుండా బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖిలాడి సినిమాను పెన్ మూవీస్ దక్కించుకొన్నది.

    ఖిలాడీ రైట్స్ పెన్ మూవీస్‌కు

    ఖిలాడీ రైట్స్ పెన్ మూవీస్‌కు

    ఖిలాడీ సినిమా రైట్స్ అమ్మకాల గురించి పెన్ మూవీస్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ సినిమాపై జనరేట్ అయిన పాజిటివ్ వైబ్స్‌తో చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 11, 2022 రోజున ఖిలాడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది అని వెల్లడించారు. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మూవీస్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నట్టు సమాచారం.

    తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది వీరే..

    తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది వీరే..

    ఖిలాడి సినిమాను నైజాంలో ఏషియన్ సునీల్, సీడెడ్‌లో తేజా పిక్చర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవీణ్, తూర్పు గోదావరి జిల్లాలో ఓం మణికంఠ ఫిల్మ్స్, నెల్లూరూలో భాస్కర్ రెడ్డి, కృష్ణ జిల్లాలో కిరణ్, ఒడిశాలో త్రిలోచన్ రెడ్డి, ఓవర్సీస్‌లో ఫ్లైహై రిలీజ్ చేస్తున్నారు. హిందీలో పెన్ మూవీస్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది.

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్


    అయితే తాజా సమాచారం ప్రకారం.. నైజాం హక్కులు రూ.9 కోట్లు, సీడెడ్ హక్కులు 3.6 కోట్లు, ఆంధ్రా హక్కులు 11 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 22 కోట్ల మేర బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్‌కు సిద్దమైంది.

    Recommended Video

    Krack సక్సెస్ జోష్ లో Ravi Teja | Khiladi First Glimpse On Republic Day | Filmibeat Telugu
    ఖిలాడీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    ఖిలాడీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: రవితేజ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి, నిక్తిన్ ధీర్, సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి, థాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అనసూయ భరద్వాజ్, కేశవ్ దీపక్ తదితరులు
    రచన, దర్శకత్వం: రమేశ్ వర్మ
    నిర్మాత: సత్యనారాయణ కొనేరు, రమేశ్ వర్మ
    సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
    ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
    మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
    నిర్మాణ సంస్థ: పెన్ మూవీస్, ఏ స్టూడియోస్
    రిలీజ్ డేట్: 2022-02-11

    English summary
    Ravi Teja's Khiladi Hindi right acquired by Pen Movies. They tweeted that, #Khiladi rights have been sold out like a hot cake.Happy about the positive vibes the film has generated. Khiladi will reach the audience on Feb 11th,2022
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X