Krack Day 5 Collections: ఐదు రోజుల్లోనే అరుదైన ఘనత.. రవితేజ దెబ్బకు బద్దలైన రికార్డులు
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి, చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు సీనియర్ హీరో రవితేజ. కమర్షియల్ సినిమాల హీరోగా పేరొందడంతో పాటు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అలరిస్తూ మాస్ మహారాజాగా పేరొందాడు. వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆయన.. ప్రస్తుతం 'క్రాక్' అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అంతేకాదు, కేవలం ఐదు రోజుల్లోనూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలు మీకోసం.!

హిట్ కొట్టేందుకు కలిసొచ్చిన డైరెక్టర్‌తో జోడీ
గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన రవితేజ.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్. ఠాగూర్ మధు నిర్మించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు.

ఆటంకం ఎదురైంది.. ఆటతోనే వేట మొదలు
సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు 'క్రాక్' విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో వివాదాలు చెలరేగాయి. దీంతో సినిమాను 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మొదటి ఆట నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా... సంక్రాంతి రేసులో మొదటి విజేతగా నిలిచింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

సినిమాకు ప్లస్ ఇవే.. అదిరిపోయే స్పందన
హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న 'క్రాక్' మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా యాక్టింగ్.. గోపీచంద్ మలినేని టేకింగ్.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలాగే, సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.

నాలుగు రోజుల కలెక్షన్లు ఎలా వచ్చాయంటే
రవితేజ నటించిన 'క్రాక్' సినిమా మొదటి రోజు నుంచే అద్భుతమైన రీతిలో కలెక్షన్లను రాబడుతోంది. ఓపెనింగ్ డే అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 6.54 కోట్లను కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు రూ. 3.15 కోట్లను వసూలు చేసింది. అలాగే, మూడో రోజు రూ. 2.86 కోట్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక, నాలుగో రోజు రూ. 3.50 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటిందీ మూవీ.

ఐదో రోజు ఏరియాల వారిగా కలెక్షన్లు ఇలా
సంక్రాంతి రోజు మరో రెండు సినిమాలు విడుదలైనా.. 'క్రాక్' మాత్రం హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోయింది. ఐదో రోజు ఇది నైజాంలో రూ. 66 లక్షలు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఈస్ట్‌లో రూ. 20 లక్షలు, వెస్ట్‌లో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 17.3 లక్షలు, కృష్ణాలో రూ. 15.2 లక్షలు, నెల్లూరులో రూ. 14.2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 27 లక్షలు.. మొత్తంగా రూ. 2.17 కోట్లు రాబట్టింది.

ఐదు రోజుల్లోనే అరుదైన ఘనత.. రికార్డులు
మొదటి రోజు నుంచి చూసుకుంటే ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 18.58 కోట్లు వసూలు చేసింది. తద్వారా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను అందుకుంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17.5 కోట్లు జరిగింది. ఐదు రోజుల్లో రూ. 18.58 కోట్లు రాబట్టడంతో రూ. కోటి పైగానే లాభాలను అందుకుంది. ఫలితంగా సంక్రాంతి బరిలోనే కాకుండా 2021లో ఫస్ట్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











