పెద్దలకేనా? రవితేజ ‘పవర్’ సెన్సార్ టాకేంటి?

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై కె.ఎస్.రవీంద్ర(బాబీ)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘పవర్'. హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అంటూ...‘ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.

ఈ సందర్భంగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ‘రవితేజ హీరోగా రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పవర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ'సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. చాలా అద్భుతంగా ఈ సబ్జెక్టుని హ్యాండిల్ చేసి ఒక పవర్ ఫుల్ మూవీగా తీర్చి దిద్దారు దర్శకుడు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా రవితేజ పాడిన ‘నోటంకి..నోటంకి' సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు అని తెలిపారు.

త్వరలోనే ఈ ఆడియోకి సంబంధించి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అన్నారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ ‘దర్శకుడుగా నా తొలి చిత్రమే ఇంత పెద్ద బేనర్లో మాస్ మహారాజా రవితేజతో చేయడం చాలా ఆనందంగా ఉంది. రవితేజగారి ఎంకరేజ్మెంట్ తో ‘పవర్' చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా రూపొందించాను అన్నారు.

Ravi Teja's Power Clears Censor Board Test

తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థమన్ మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియోని మించిన హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది' అన్నాడు దర్శకుడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X