ఇంకో పెద్ద సినిమా కూడాఈ నెల్లోనే...డేటిచ్చేసారు
హైదరాబాద్ : రవితేజ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'పవర్'. హన్సిక హీరోయిన్ . కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. తమన్ అందించిన ఈ చిత్రం ఆడియోని ఈనెల 10న విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయటానికి నిర్ణయించామని నిర్మాత తెలిపారు. ఈ నెలలో ఇప్పటికే రెండు భారీ చిత్రాలు ఎన్టీఆర్ నటించిన రభస, సూర్య నటించిన సికిందర్ చిత్రాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు మాట్లాడుతూ... పవర్ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు అన్నారు.
ఇటీవల బ్యాంకాక్‌లో యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించాం. బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో రవితేజ, హన్సికలపై ఓ పాటని చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం. ఈనెల 29న 'పవర్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











