అనుకున్నట్లే అయ్యింది..వాయిదా పడింది
హైదరాబాద్ : కారణాలు ఏమైనా రవితేజ తాజా చిత్రం గత కొద్ది రోజులుగా వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది. అది నిజమే అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఎట్టి పరిస్ధితుల్లో ఈ శుక్రవారం విడుదల చేద్దామనుకున్నా సెన్సార్ లేటు అవటం వల్ల లేటు అయ్యిందని చెప్తున్నారు. ఈ నెల 12 న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ విధమైన ప్రకటనా రాలేదు.
దర్శకుడు మాట్లాడుతూ... పవర్ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు అన్నారు అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం ''అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











