Ramarao On Duty Business: రవితేజ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు తక్కువ.. ఎంత రావాలంటే!

బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రవితేజ. తనదైన శైలి యాక్టింగ్‌తో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఫిదా చేసేలా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ అనే బిరుదును దక్కించుకున్నాడు. ఇలా చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో రాబోతున్నాడు. ఎన్నో అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఈ సినిమాకు ఎక్కడ? ఎంత? బిజినెస్ జరిగింది? అనే వివరాలు చూద్దాం పదండి!

క్రాక్‌తో హిట్.. ఖిలాడీగా డిజాస్టర్

క్రాక్‌తో హిట్.. ఖిలాడీగా డిజాస్టర్

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ 'క్రాక్' మూవీ ఫలితంతో జోష్ మీదున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఈ మాస్ హీరో ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి ఆశించిన రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన దక్కలేదు. ఫలితంగా నిర్మాతలకు చాలా నష్టాలు వచ్చాయి.

రామారావుగా మారిన మాస్ హీరో

రామారావుగా మారిన మాస్ హీరో

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ తెరకెక్కించిన ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

అలాంటి కథ.. మంచి మెసేజ్‌తో

అలాంటి కథ.. మంచి మెసేజ్‌తో

తెలుగు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తోన్న రామారావు అనే ఆఫీసర్.. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేశాడు? అనే నేపథ్యంతో 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తెరకెక్కింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో రూపొందినట్లు తెలుస్తోంది.

ప్రమోషన్స్ షురూ.. సందడిగానే

ప్రమోషన్స్ షురూ.. సందడిగానే

మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, ఈరోజు సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా తక్కువగానే బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 7 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా


రవితేజ మార్కెట్‌కు అనుగుణంగానే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.00 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 17.20 కోట్లు బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది.

చాలా తగ్గిపోయిన ప్రీ బిజినెస్

చాలా తగ్గిపోయిన ప్రీ బిజినెస్

వాస్తవానికి రవితేజ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. 'క్రాక్' మూవీకి కరోనా పరిస్థితుల కారణంగా రూ. 17.50 కోట్ల వ్యాపారమే జరిగింది. కానీ, దాని తర్వాత వచ్చిన 'ఖిలాడీ' మాత్రం రూ. 24 కోట్లు పైగా బిజినెస్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ'కి మాత్రం కేవలం రూ. 17.20 బిజినెస్ జరగడం అందరికీ షాక్ ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X