రవితేజ 'సారొచ్చారు' ఫైనల్ రిజల్ట్?
హైదరాబాద్ : రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొంది,మొన్న శుక్రవారం విడుదైన చిత్రం 'సారొచ్చారు'. రవితేజను కొత్తగా చూపించామని, ప్యామిలీ తరహా కథాంశంతో వచ్చన చిత్రమని,క్లాస్ ఫిల్మ్ అని రిలీజ్ కు ముందు నానా హడావిడీ చేసిన ఈ చిత్రం మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా టీవీ సీరియల్ గా అంతూ పొంతూ లేకుండా కేవలం డైలాగులు మీద నడుస్తూ నస పెట్టిందని వార్తలు వచ్చాయి. ఈ వీకెండ్స్ లో ఈ చిత్రందే హవా అనుకున్న వారికి సైతం ఈ చిత్రం ట్విస్ట్ ఇచ్చింది. కలెక్షన్స్ చాలా చోట్ల బాగా డ్రాప్ అయ్యిందని సమాచారం.
మరో ప్రక్క ఈ చిత్రంకు పబ్లిసిటీ కూడా సరిగ్గా జరగలేదు. చిత్రం ఆడియో సైతం జరపకపోవటం,రిలీజ్ కు ముందు,రిలీజ్ తర్వాత మీడియాలో హంగామా నూ జరగలేదు. దాంతో చాలా మందికి ఈ చిత్రం విడుదలైన విషయమే తెలియలేదు. చూసిన వారు సైతం..సినిమాలో రెగ్యులర్ రవితేజ చిత్రాల్లో కనిపించే కామెడీ కరువు అయ్యిందని, శోభన్ బాబు టైమ్ లో రావాల్సిన చిత్రమని కామెంట్స్ చేస్తూండటం,అవి స్ప్రెడ్ అవటం సినిమాకు మైనస్ గా మారింది.
'మంచి ప్రేమ కథతో' అనే కాప్షన్ తో వచ్చిన ఈ చిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మించారు. గతంలో ఇదే బ్యానర్ పై బాణం, ఓం శాంతి ఓం చిత్రాలు వచ్చాయి. ఈ బ్యానర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. రవితేజ విషయానికి వస్తే ఆయన మిరపకాయ చిత్రం దాటాక ఒక్క హిట్టూ పడలేదు. వరసగా నిప్పు, వీర, దరువు, దేముడు చేసిన మనుష్యులు, ఇప్పుడు సారొచ్చారు..భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యి నిరాశ మిగిల్చాయి.


Click it and Unblock the Notifications











