EAGLE 10 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. అయినా 10 రోజుల్లో ఇంతే.. రవితేజకు హిట్ రావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు చాలా రకాల ఇమేజ్‌లను దక్కించుకున్నారు. అందులో మాస్ హీరోగా స్టార్‌డమ్‌ను అందుకున్న వాళ్లు మాత్రం కొందరే ఉన్నారు. వారిలో రవితేజ ఒకడు. చాలా కాలంగా ఇండస్ట్రీలో ప్రభావాన్ని చూపిస్తోన్న అతడు.. వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఇలా ఇటీవలే 'ఈగల్' అనే యాక్షన్ సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదనే చెప్పాలి. అయితే, ఈ వీకెండ్‌లో వసూళ్లు పెరిగాయి. మరి 'ఈగల్' 10 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

యాక్షన్ మోడ్‌లోకి రవితేజ
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని అందించాడు.

 Ravi Teja Starrer EAGLE Movie 10 Days Worldwide Collections

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్
రవితేజ 'ఈగల్' సినిమాకు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు ఎంత వచ్చింది?
'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో అవుతూ వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. ఇలా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 43 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వచ్చింది.

10 రోజుల్లో ఎంత వచ్చింది?
10 రోజుల్లో 'ఈగల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, గుంటూరులో రూ. 1.14 కోట్లు, కృష్ణాలో రూ. 79 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో కలిపి.. రూ. 12.90 కోట్లు షేర్, రూ. 23.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Ravi Teja Starrer EAGLE Movie 10 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబోలో రూపొందిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో పది రోజుల్లో రూ. 12.47 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.44 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 15.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 50.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
యాక్షన్ స్టోరీతో రూపొందిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 15.86 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.14 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X