EAGLE 11 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 11 రోజుల్లో అన్ని కోట్లు.. ఈగల్ హిట్ కావాలంటే మాత్రం!
ఏమాత్రం సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయమై.. అంతంతగా ఎదుగుతూ ఏకంగా స్టార్‌డమ్‌ను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఊపులోనే అతడు ఏడాదికి కనీసం రెండు సినిమాలతోనైనా వస్తున్నాడు. అయితే, ఈ మధ్య హిట్‌ను మాత్రం అందుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో ఇటీవలే రవితేజ 'ఈగల్' అనే యాక్షన్ సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదనే చెప్పాలి. అయితే, ఈ వీకెండ్‌లో వసూళ్లు పెరిగినా మళ్లీ తగ్గాయి. మరి 'ఈగల్' 11 రోజుల వసూళ్లను మీరే చూడండి!

యాక్షన్ స్టోరీతో రవితేజ రాక: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్: రవితేజ నటించిన 'ఈగల్'కు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ అయింది.

11వ రోజు ఎంత వచ్చింది?: సోలో సూపర్ హిట్ కోసం వేచి చూస్తున్న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో అవుతూనే ఉంది. ఇలా 11వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రవితేజ సినిమా కేవలం రూ. 20 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్‌ను అందుకుంది.
11 రోజుల్లో ఎంత వచ్చింది?: 'ఈగల్' మూవీకి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 81 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో కలిపి.. రూ. 13.10 కోట్లు షేర్, రూ. 23.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కలయికలో రూపొందిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 13.10 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.54 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 16.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 50.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: హై రేంజ్ యాక్షన్‌తో వచ్చిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 16.11 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.89 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











