EAGLE 2 Days Collections: ఈగల్‌కు సాలిడ్ కలెక్షన్లు.. 2 రోజుల్లో అన్ని కోట్లు.. అదే కంటిన్యూ అయితే!
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే అతడు.. ఇప్పుడు మాత్రం భారీ బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా రవితేజ 'ఈగల్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. దీంతో వసూళ్లు బాగానే లభిస్తున్నాయి. మరి రవితేజ నటించిన 'ఈగల్' మూవీ 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ఈగల్‌గా వచ్చేసిన రవితేజ: మాస్ మహారాజా రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే 'ఈగల్'. ఈ హై రేంజ్ యాక్షన్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని అందించారు.

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్: రవితేజ నటించిన 'ఈగల్'కు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ జరిగింది.

2వ రోజు అలా.. మొత్తంగా: మాస్ మహారాజా రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' చిత్రానికి రెండో రోజు కూడా సాలిడ్ రెస్పాన్స్ లభించిందనే చెప్పాలి. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.60 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.10 కోట్లు షేర్ రాబట్టింది. ఇలా ఈ చిత్రం 2 రోజుల్లోనే రూ. 9 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











