EAGLE 3 Days Collections: రవితేజ మాస్ బ్యాటింగ్.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు ఔట్.. ఈగల్ హిట్ కావాలంటే!
టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపును తెచ్చుకున్నారు. వారిలో రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసినా.. ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'ఈగల్' అనే యాక్షన్ మూవీని చేశాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో వసూళ్లు బాగానే వస్తున్నాయి. మరి రవితేజ నటించిన 'ఈగల్' మూవీ 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఈగల్‌గా రవితేజ అరాచకం:మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని సమకూర్చారు.

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్:రవితేజ 'ఈగల్' సినిమాకు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు ఎంత వచ్చింది?
'ఈగల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 45 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 2.90 కోట్లు షేర్, రూ. 5.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజుల్లో ఎంత వచ్చింది?
3 రోజుల్లో 'ఈగల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలతో కలిపి.. రూ. 9.70 కోట్లు షేర్, రూ. 17.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మూడు రోజుల్లో రూ. 9.70 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 3 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 11.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 11.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











