EAGLE 5 Days Collections: ఈగల్‌కు ఊహించని వసూళ్లు.. 5 రోజుల్లో అన్ని కోట్లు.. కానీ హిట్ అవ్వాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న అతడు.. ఆ తర్వాత పలు చిత్రాలు చేశాడు. కానీ, ఆశించిన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే 'ఈగల్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ బాగానే లభిస్తోంది. దీంతో వసూళ్లు మంచిగా వస్తున్నాయి. మరి రవితేజ నటించిన 'ఈగల్' మూవీ 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూసేయండి!
ఈగల్‌గా రవితేజ విశ్వరూపం:టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా నటించిన వైల్డ్ యాక్షన్ మూవీనే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని అందించారు.

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్:రవితేజ నటించిన 'ఈగల్'కు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ జరిగింది.
5వ రోజు ఎంత వచ్చింది?:మాస్ మహారాజా రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో మాత్రం క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 47 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వచ్చింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?:'ఈగల్' మూవీకి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 96 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 62 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో కలిపి.. రూ. 11.13 కోట్లు షేర్, రూ. 19.85 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఐదు రోజుల్లో రూ. 11.13 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 13.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 35 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 13.53 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.47 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











