EAGLE 7 Days Collections: 22 కోట్లు వస్తే హిట్.. కానీ వారంలో వచ్చింది ఇంతే.. ఇంకెంత రావాలో తెలిస్తే!
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎంతో కాలం పాటు కష్టాలను అనుభవించి.. సోలో హీరోగా మారి సత్తా చాటాడు రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ మనసు దోచి మాస్ మహారాజా అయ్యాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నాడు.
ఇలా గత వారంలోనే 'ఈగల్' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ క్రమంగా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. మరి 'ఈగల్' మూవీ 7 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

ఈగల్‌గా ఎంటరైన రవితేజ: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్: రవితేజ నటించిన 'ఈగల్'కు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎంత వచ్చింది : మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో మాత్రం క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా వసూళ్లు డల్ అయ్యాయి. ఇలా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 30 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.
7 రోజుల్లో ఎంత వచ్చింది :'ఈగల్' మూవీకి 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 1.04 కోట్లు, కృష్ణాలో రూ. 69 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో కలిపి.. రూ. 11.85 కోట్లు షేర్, రూ. 21.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత : రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఏడు రోజుల్లో రూ. 11.85 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 14.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 38 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి :యాక్షన్ స్టోరీతో వచ్చిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 14.51 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 7.49 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











