EAGLE 8 Days Collections: రవితేజ మూవీకి కష్టాలు.. 8 రోజుల్లో అన్ని కోట్లే.. ఇంకా రావాల్సింది ఎంతంటే!
టాలీవుడ్‌లో తనదైన కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తున్న హీరోనే మాస్ మహారాజా రవితేజ. అస్సలు బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తున్న అతడికి విజయాలు మాత్రం పెద్దగా దక్కడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'ఈగల్' మూవీని చేశాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం ఆశించిన రీతిలో రాబట్టుకోవడం లేదు. దీంతో ఈ చిత్రం డౌన్ అవుతూనే ఉంది. మరి 'ఈగల్' 8 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!
ఈగల్‌గా రవితేజ ఊచకోత:టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్:రవితేజ 'ఈగల్' సినిమాకు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ అయింది.
8వ రోజు ఎంత వచ్చింది?:చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో మాత్రం క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 24 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.
8 రోజుల్లో ఎంత వచ్చింది?:8 రోజుల్లో 'ఈగల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, గుంటూరులో రూ. 1.06 కోట్లు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో కలిపి.. రూ. 12.09 కోట్లు షేర్, రూ. 21.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కలయికలో తెరకెక్కిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఎనిమిది రోజుల్లో రూ. 12.09 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.44 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 14.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 39 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 14.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 7.17 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











