EAGLE 9 Days Collections: ఈగల్‌కు పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లో అన్ని కోట్లు.. రవితేజ హిట్ కొట్టాలంటే!

మాస్ మహారాజా రవితేజ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక ఇన్సిప్రేషన్. దీనికి కారణం అతడు స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి బడా స్టార్‌గా ఎదిగిపోవడమే. అంతేకాదు, తనదైన చిత్రాలను చేస్తూ ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'ఈగల్' అనే యాక్షన్ ఓరియెంటెడ్ మూవీని చేశాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం ఆశించిన రీతిలో రాబట్టుకోవడం లేదు. అయితే, ఈ వీకెండ్‌లో కాస్త పుంజుకుంది. మరి 'ఈగల్' 9 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

రవితేజ మరో కొత్త ప్రయోగం:మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని సమకూర్చారు.

 Ravi Teja Starrer EAGLE Movie 9 Days Worldwide Collections

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్:రవితేజ నటించిన 'ఈగల్'కు నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎంత వచ్చింది?:సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. వీక్ డేస్‌లో మాత్రం క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. అయితే, వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. ఇలా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 38 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వచ్చింది.

9 రోజుల్లో ఎంత వచ్చింది?:'ఈగల్' మూవీకి 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షలతో కలిపి.. రూ. 12.47 కోట్లు షేర్, రూ. 22.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కలిసి చేసిన 'ఈగల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో తొమ్మిది రోజుల్లో రూ. 12.47 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.49 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 15.31 కోట్లు షేర్‌తో పాటు రూ. 40 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Ravi Teja Starrer EAGLE Movie 9 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ స్టోరీతో రూపొందిన 'ఈగల్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో రవితేజ సినిమాకు రూ. 15.31 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.69 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X