EAGLE Day 1 Collections: ఈగల్‌కు ఊహించని వసూళ్లు.. తొలి రోజు అన్ని కోట్లు.. ఆ సినిమాల కంటే!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి.. ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా మారాడు రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో అభిమానులను సంపాదించుకుని మాస్ మహారాజా అనిపించుకున్నాడు. ఈ మధ్యన సరైన హిట్ కోసం చూస్తున్న అతడు.. తాజాగా 'ఈగల్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో తొలి రోజు మంచి స్పందనే వచ్చింది. మరి రవితేజ నటించిన 'ఈగల్' మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ఈగల్‌గా ఎంటరైన రవితేజ:మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

Ravi Teja Starrer EAGLE Movie Day 1 Worldwide Collections

ఈగల్ మూవీకి ప్రీ బిజినెస్:రవితేజ 'ఈగల్' మూవీకి నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 17.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 21.00 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్‌తో డీసెంట్:యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'ఈగల్' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే పర్వాలేదనిపించేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే మోస్తరు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

Ravi Teja Starrer EAGLE Movie Day 1 Worldwide Collections

మొదటి రోజు అన్ని కోట్లు:మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.20 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 4.80 కోట్లు వరకూ రాబట్టింది. ఈ వసూళ్లు ఇటీవలి కాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో బెస్ట్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X