EAGLE Business: రవితేజ మూవీకి షాకింగ్ బిజినెస్.. ఆ మూవీల కంటే తక్కువ.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. కానీ, కొందరు స్టార్లు మాత్రం వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు.

కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఇప్పుడు 'ఈగల్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది? ఎన్ని కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌గా నిలుస్తుంది? అనే వివరాలను చూద్దాం పదండి!

Ravi Teja Starrer EAGLE Movie Worldwide Pre Release Business

ఈగల్‌గా రాబోతున్న రవితేజ: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మాస్ మూవీనే 'ఈగల్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.

Ravi Teja Starrer EAGLE Movie Worldwide Pre Release Business

అలాంటి స్టోరీ.. ఫుల్ యాక్షన్‌: రవితేజ నటించిన 'ఈగల్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఒక ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న ఓ వ్యక్తి.. ఏ సిస్టమ్‌నూ తన చేరువలోకి కూడా రాకుండా చేయడం.. అతడిని ఓడించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయడం అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

Ravi Teja Starrer EAGLE Movie Worldwide Pre Release Business

రిలీజ్‌కు రెడీ.. సందడిగానే: మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీని ఫిబ్రవరి 9వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. కానీ, బుకింగ్స్ విషయంలో మాత్రం ఈ మూవీ జోష్ అంతగా కనిపించట్లేదనే చెప్పుకోవాలి.

హక్కులకు ఫుల్ డిమాండ్: ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఈగల్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Ravi Teja Starrer EAGLE Movie Worldwide Pre Release Business

ఏపీ, తెలంగాణలో బిజినెస్: రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా: 'ఈగల్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 22 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

Ravi Teja Starrer EAGLE Movie Worldwide Pre Release Business

ఆ సినిమాల కంటే తక్కువ: రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా అతడి కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల్లో ఇది 4వ స్థానానికి చేరుకుంది. దీనికంటే ముందు 'టైగర్ నాగేశ్వరరావు' రూ. 37.50 కోట్లు, 'ఖిలాడీ' రూ. 22.80 కోట్లు, 'రావణాసుర' రూ. 22.20 కోట్లతో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X