Mr Bachchan 2 Days Collection: 2వ రోజే డౌన్.. రవితేజ మూవీకి షాక్.. అసలు ఎంత రావాలో తెలిస్తే!
తెలుగు సినిమా రంగంలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న ఆయన.. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఆశించిన విధంగా ప్రదర్శన చేయట్లేదు. దీంతో కలెక్షన్లు డౌన్ అయ్యాయి. మరి 'మిస్టర్ బచ్చన్' 2 రోజుల్లో ఎంత రాబట్టాడో మీరే చూసేయండి!
మిస్టర్ బచ్చన్ వచ్చేశాడుగా
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన సినిమానే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా
రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.

2వ రోజు డౌన్.. మొత్తంగానూ
మాస్ మహారాజా రవితేజ - స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు రెండో రోజే రెస్పాన్స్ బాగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు మాత్రమే షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.75 కోట్లు వసూలు చేసుకుంది. ఇలా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 8 కోట్లు షేర్ కలెక్ట్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











