Mr Bachchan 3 Days Collection: రవితేజకు దారుణమైన వసూళ్లు.. 3 రోజుల్లో ఇంతే.. మూవీ హిట్ కావాలంటే మాత్రం!
టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో పక్కా కమర్షియల్ హీరోగా ముద్ర పడిపోయిన రవితేజ ఒకడు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే అతడు.. భారీ సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లేదు. దీంతో కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. మరి రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ 3 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
మిస్టర్ బచ్చన్‌గా మారాడు
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమానే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు చేశారు.

రవితేజకు బిజినెస్ ఇలా
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ జరుపుకుంది.
3వ రోజు తెలుగులో ఎంత
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు టాక్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో స్పందన సరిగా రావట్లేదు. ఇలానే మూడో రోజు కూడా అనూహ్యంగా రెస్పాన్స్ తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది దారుణమైన ప్రదర్శన చేసింది. ఫలితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 62 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

3 రోజులకు ఎంతొచ్చింది?
'మిస్టర్ బచ్చన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 98 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 67 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో రూ. 5.98 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 5.98 కోట్లు రాబట్టిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 39 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.85 కోట్లు షేర్, రూ. 10.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాంబోలో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32.00 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 6.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 25.15 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











