Mr Bachchan 4 Days Collection: రవితేజకు కోలుకోలేని షాక్.. 4వ రోజే ఇంత ఘోరమా.. బచ్చన్ హిట్ కావాలంటే!
మాస్ మహారాజా రవితేజ.. తెలుగు సినిమా ప్రియులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలతో టాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను బాగా పెంచుకుంటున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు ఈ మాస్ హీరో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. మరి రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ 4 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
మిస్టర్ బచ్చన్ వచ్చేశాడు
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన కమర్షియల్ మూవీనే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

రవితేజకు బిజినెస్ ఇలా
రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.
4వ రోజు ఇలా.. మొత్తంగా
మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి ప్రేక్షకుల స్పందన లభించడం లేదు. ముఖ్యంగా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా 4వ రోజు బాగా డౌన్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 7.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











