Mr Bachchan 5 Days Collection: మిస్టర్ బచ్చన్ దారుణం.. రవితేజ కెరీర్‌లో తొలిసారి.. 5 రోజుల్లో ఇంతేనా!
టాలీవుడ్‌లో ఫలితాలను బేరీజు వేసుకోకుండా సినిమాలు చేస్తోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న అతడు.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. టాక్‌ను సరిగా అందుకోకపోవడంతో వసూళ్లను పెద్దగా రాబట్టడం లేదు. ఈ నేపథ్యంలో రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ 5 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
మిస్టర్ బచ్చన్‌గా మారాడు
మాస్ మహారాజా రవితేజ నటించిన క్రేజీ సినిమానే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు చేశారు.

రవితేజకు బిజినెస్ ఇలా
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసుకుంది.
5వ రోజు ఇలా.. టోటల్‌గా
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు మొదటి నుంచీ ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఐదో రోజు కూడా ఇది దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 35 లక్షలే రాబట్టింది. ఇక, ఐదు రోజుల్లో రూ. 7.80 కోట్లే కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











