Mr Bachchan 7 Days Collection: 32 కోట్లు రావాలి.. వారంలో మరీ దారుణంగా.. చెత్త రికార్డ్ దిశగా బచ్చన్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా కష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారాడు రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఆకట్టుకునే చిత్రాలు చేస్తూ మాస్ మహారాజా అనిపించుకున్నాడు. దీంతో అతడి రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు రవితేజ 'మిస్టర్ బచ్చన్' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ దారుణమైన రెస్పాన్స్‌తో ఢీలా పడిపోయింది. మరి 'మిస్టర్ బచ్చన్' మూవీ 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి!

మిస్టర్ బచ్చన్‌‌గా వచ్చాడు
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన కమర్షియల్ మూవీనే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

Ravi Teja Starrer Mr Bachchan Movie 7 Days Worldwide Collections Details

రవితేజకు బిజినెస్ ఇలా
రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ జరిపింది.

7వ రోజు ఇలా.. టోటల్‌గా
స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఏడో రోజు కూడా ఇది దారుణమైన రెస్పాన్స్‌తో ఢీలా పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 10 లక్షలే రాబట్టింది. ఇలా వారంలో కేవలం రూ. 7.95 కోట్లే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X