Mr Bachchan Closing Collection: 32 కోట్లు వస్తేనే హిట్.. వారంలోనే క్లీన్ బౌల్డ్.. రవితేజ ఘోరమైన రికార్డు
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో వేగంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తే వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో వస్తోన్న అతడు.. ఇటీవలే 'మిస్టర్ బచ్చన్' అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఫలితంగా భారీ నష్టాలతో రన్ ముగించింది. మరి 'మిస్టర్ బచ్చన్' మొత్తంగా ఏ ఫలితాన్ని అందుకుందో చూడండి!
మిస్టర్ బచ్చన్‌గా రవితేజ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు చేశారు.

రవితేజకు బిజినెస్ ఇలా
రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.
అలాంటి టాక్‌తో నిరాశగా
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. దీంతో ఆరంభంలోనే అనుకున్న విధంగా వసూళ్లు లభించలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో వారంలోనే ఈ చిత్రం ఔట్ అయింది.

తెలుగులో ఎంతొచ్చింది?
'మిస్టర్ బచ్చన్'కు ఏపీ, తెలంగాణలో రన్ దాదాపుగా పూర్తైంది. దీంతో క్లోజింగ్ టైమ్‌కు నైజాంలో రూ. 3.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో రూ. 6.95 కోట్లు షేర్, రూ. 11.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.90 కోట్లు రాబట్టిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ దారుణమైన ఫలితాన్ని చూసింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 58 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.98 కోట్లు షేర్, రూ. 13.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. నష్టం అలా
సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32.00 కోట్లుగా నమోదైంది. ఇక, మొత్తంగా దీనికి రూ. 7.98 కోట్లు వచ్చాయి. అంటే రూ. 24.02 కోట్లు నష్టాలతో ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.


Click it and Unblock the Notifications











