Mr Bachchan Day 1 Collection: రవితేజ మూవీకి ఊహించని వసూళ్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లో తెలిస్తే!
తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో రవితేజ ఒకడు. ఇలా కమర్షియల్ హీరో అయిన అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు అనుకున్న విధంగా టాక్ రాలేదు. ఫలితంగా దీనికి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. మరి 'మిస్టర్ బచ్చన్' తొలి రోజు ఎంత రాబట్టాడో మీరే చూసేయండి!
మిస్టర్ బచ్చన్‌గా రవితేజ రాక
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రమే 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. రెస్పాన్స్‌తో
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. ఫలితంగా రవితేజ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు స్పందన ఆశించినట్లుగా దక్కలేదు.
తొలి రోజు ఎంత వచ్చింది?
హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు మొదటి రోజు అనుకున్న విధంగా స్పందన లభించలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రూ. 3.50 కోట్లు మేర షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 4.20 కోట్లు వరకూ రాబట్టింది. ప్రీమియర్స్ షోలతో కలుపుకుంటే ఇది రూ. 5 కోట్లు వరకూ వసూలు చేసుకుంది.


Click it and Unblock the Notifications











